రిటైర్మెంట్ పై ఎటూ తేల్చని కోహ్లీ: ఇంగ్లండ్ టూర్‌‌‌‌కు వెళ్లడంపై డైలమా

రిటైర్మెంట్ పై ఎటూ తేల్చని కోహ్లీ: ఇంగ్లండ్ టూర్‌‌‌‌కు వెళ్లడంపై డైలమా
  • టెస్టులకు వీడ్కోలు పలికే విషయంపై తగ్గని విరాట్‌

న్యూఢిల్లీ: టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ.. ఇంగ్లండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో ఆడటంపై డైలమా కొనసాగుతోంది. ఈ టూర్‌‌‌‌కు తాను సిద్ధంగా ఉన్నానా? లేదా? అన్న విషయాన్ని కోహ్లీ ఇంకా బీసీసీఐకి స్పష్టం చేయలేదు. దీంతో టెస్టు క్రికెట్‌‌‌‌కు అద్భుతమైన ముగింపు పలకాలని విరాట్‌‌‌‌ కోరుకుంటున్నా.. అది ఎలా అన్న దానిపై స్పష్టత రావడం లేదు. వీడ్కోలు అంశంపై పునఃపరిశీలించాలని బోర్డు కోహ్లీకి విజ్ఞప్తి చేసినా తాను మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. 

‘టెస్టుల నుంచి వైదొలగాలనే తన అభిప్రాయాన్ని కోహ్లీ రెండు వారాల క్రితమే సెలెక్టర్లకు తెలియజేశాడని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘కోహ్లీ తన నిర్ణయాన్ని చెప్పాడు. కానీ ఇంత ముఖ్యమైన టూర్‌‌‌‌లో అనుభవం లేని మిడిలార్డర్‌‌‌‌ను బలోపేతం చేయడానికి అతను ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఆ దిశగా అతన్ని ఒప్పించడానికి సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఇంకా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గడం లేదు. వచ్చే వారం సెలెక్షన్‌‌‌‌ కమిటీ సమావేశం ఉంది. 

ఆ లోగా ఏదైనా నిర్ణయం రావొచ్చేమో’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అద్భుతమైన టెస్టు కెరీర్‌‌‌‌ కలిగి ఉన్న విరాట్‌‌‌‌.. ఇటీవల ఈ ఫార్మాట్‌‌‌‌లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌లో ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ వెలుపల పడే బాల్స్‌‌‌‌ను ఆడి పదేపదే ఔటయ్యాడు. దీంతో అతను ఇప్పటికీ తుదిజట్టులో  స్థానానికి అర్హుడా? అనే ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయి. 

ఒకవేళ కోహ్లీ ఈ టూర్‌‌‌‌కు రాకపోతే నాలుగో ప్లేస్‌‌‌‌కు శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌లో ఒకర్ని ఎంచుకునే చాన్స్‌‌‌‌ ఉంది. సర్ఫరాజ్‌‌‌‌ స్థానం కోసం రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నాడు. మరోవైపు షమీ టెస్ట్‌‌‌‌ కెరీర్‌‌‌‌పై కూడా డౌట్స్‌‌‌‌ నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో షమీకి ప్రత్యామ్నాయంగా మరో బౌలర్‌‌‌‌ను పరీక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి.