
జీడిమెట్ల, వెలుగు: అన్నివర్గాల ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని కుత్బుల్లాపూర్సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వెంకటేశ్వర్‌నగర్ నుంచి యువతతో కలిసి పెద్ద ఎత్తున బైక్‌లతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచి జనాలను మోసం చేసిందన్నారు. మళ్లీ కల్లబొల్లి వాగ్ధానాలు చెబితే ఈసారి జనం నమ్మే స్థితిలో లేరన్నారు.
ఇచ్చిన హామీలు, మాట నిలబెట్టుకునే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. తెలంగాణాలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇందుకు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. బాచుపల్లిలో కొలను హనుమంతరెడ్డి సతీమణి నీరజారెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు.