ఫైనల్​కు కోల్​కథ: ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ

ఫైనల్​కు కోల్​కథ: ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ
  •  అదరగొట్టిన బౌలర్లు, ఓపెనర్లు
  •  క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌2లో ఢిల్లీపై  విక్టరీ
  •  రేపు చెన్నైతో అమీతుమీ
  • మూడోసారి టైటిల్​ ఫైట్​కు నైట్​రైడర్స్​

కోల్‌‌‌‌‌‌‌‌కతా విజయానికి  25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాలి. చేతిలో 8 వికెట్లున్నాయి. ఇంకేం  నాలుగైదు బాల్స్‌‌‌‌‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగుస్తుందని, ఆ జట్టు ఘన విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, తర్వాతి 23 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఏడు రన్సే ఇచ్చి ఆరు వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను దాదాపు చేతుల్లోకి తీసుకున్నారు.  లాస్ట్ రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఆరు రన్స్ అవసరం అవగా ఢిల్లీకే మొగ్గు కనిపించింది. కానీ,  రాహుల్‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విన్నింగ్​ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టేశాడు. ఇలా ఆఖర్లో అనూహ్య మలుపులు తిరిగిన క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌2లో ఢిల్లీపై నెగ్గిన కోల్‌‌‌‌‌‌‌‌కతా ఐపీఎల్​లో ఏడేళ్ల తర్వాత ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరింది.     కేకేఆర్​.. సీఎస్​కేతో అమీతుమీకి రెడీ అవగా.. ఢిల్లీ తొలి టైటిల్​ కల మళ్లీ చెదిరింది!


షార్జా: ఐపీఎల్​లో మరోసారి పాత విజేతకే టైటిల్​ రానుంది. తొలిసారి విజేతగా నిలవాలనుకున్న లాస్ట్ ఇయర్​ రన్నరప్​ ఢిల్లీ ఈసారి  ప్లేఆఫ్స్​కే పరిమితం అవగా..  కోల్​కతా మూడో టైటిల్​కు అడుగు దూరంలో నిలిచింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు యువ ఓపెనర్లు  వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (46 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 46) జోరుతో బుధవారం జరిగిన క్వాలిఫయర్​2లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ మూడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరింది.  తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 135/5 స్కోరు చేసింది. శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ (36),   శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (30 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్లు. వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి (2/26) రెండు వికెట్లు తీశాడు. అనంతరం కోల్‌‌‌‌‌‌‌‌కతా19.5  ఓవర్లలో 136/7  స్కోరు చేసి  గెలిచింది.  వెంకటేశ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.  కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు రావడం ఇది మూడోసారి. 2012, 2014లో ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ ఆడి  నెగ్గింది. శుక్రవారం జరిగే టైటిల్​ ఫైట్​లో  సీఎస్‌‌‌‌‌‌‌‌కేను ఢీకొట్టనుంది.
ఢిల్లీ నిదానంగా..
టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నిదానంగా సాగింది. షార్జా స్లో వికెట్‌‌‌‌‌‌‌‌పై ఢిల్లీని కట్టడి చేయడంలో  కేకేఆర్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ ఒకే రన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా.. ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో బౌండ్రీల ఖాతా తెరిచిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌ పృథ్వీ షా (18)... షకీబ్‌‌‌‌‌‌‌‌ వేసిన మూడో ఓవర్లో 6,4తో గేరు మార్చాడు. 9 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క పరుగే చేసిన ధవన్‌‌‌‌‌‌‌‌.. నరైన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లతో జోరు పెంచాడు. దాంతో, నాలుగు ఓవర్లకు 32/0తో క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఐదో ఓవర్లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ వరుణ్‌‌‌‌‌‌‌‌ తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కే పృథ్వీని ఎల్బీ చేసి కేకేఆర్‌‌‌‌‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. అక్కడి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ డీలా పడింది.  5 నుంచి 17 ఓవర్ల మధ్య కేవలం మూడు బౌండ్రీలే వచ్చాయి. స్లోగా ఆడిన స్టోయినిస్​ (18)    మావి వేసిన 12వ ఓవర్లోబౌల్డ్‌‌‌‌‌‌‌‌ అవ్వగా.. 15వ ఓవర్లో  ధవన్‌‌‌‌‌‌‌‌ను వరుణ్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (6)  ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌కు వికెట్​ ఇచ్చుకున్నాడు.  వరుణ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఔటైనా.. అది నో బాల్‌‌‌‌‌‌‌‌ కావడంతో బతికిపోయిన హెట్‌‌‌‌‌‌‌‌మయర్ (17).. ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. ఇక, చివరిదాకా క్రీజులో ఉన్న శ్రేయస్‌‌‌‌‌‌‌‌.. మావి వేసిన లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో 4,6 సహా 15 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టడంతో ఢిల్లీ స్కోరు 130 దాటింది. 
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 135/5 (ధవన్‌‌‌‌‌‌‌‌ 36, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 30 నాటౌట్‌‌‌‌‌‌‌‌, చక్రవర్తి 2/26).
కోల్‌‌‌‌‌‌‌‌కతా:    19.5 ఓవర్లలో 136/ 7(వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ 55, గిల్‌‌‌‌‌‌‌‌ 46, రబాడ 2/23).

వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ ఫటాఫట్‌‌‌‌‌‌‌‌
ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న యంగ్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఢిల్లీ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ తడబడిన చోట.. ఛేజింగ్​లో ఈ ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ముఖ్యంగా వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ మరోసారి తన బ్యాట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ చూపించాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌నే బౌండ్రీకి చేర్చిన గిల్‌‌‌‌‌‌‌‌.. స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా అయ్యర్‌‌‌‌‌‌‌‌  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ షాట్లు కొట్టాడు. అశ్విన్‌‌‌‌‌‌‌‌ వేసిన రెండో ఓవర్లో స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌తో ఫోర్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన వెంకటేశ్‌‌‌‌‌‌‌‌.. అక్షర్‌‌‌‌‌‌‌‌, రబాడ ఓవర్లలో భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో, పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 51/0 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. తర్వాతి మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ రాకపోయినా.. అక్షర్‌‌‌‌‌‌‌‌ వేసిన పదో ఓవర్లో అయ్యర్‌‌‌‌‌‌‌‌ ఇంకో సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదాడు. అదే జోరుతో 38 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. రబాడ వేసిన 13వ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన యంగ్​స్టర్​ షాట్‌‌‌‌‌‌‌‌ ఆడి బౌండ్రీలైన్​ దగ్గర క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్ అయింది. అయినా నితీష్‌‌‌‌‌‌‌‌ రాణా (13)తో గిల్‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని కరిగించాడు.
ఆఖర్లో హైడ్రామా
కేకేఆర్‌‌‌‌‌‌‌‌ విజయానికి 25 బాల్స్‌‌‌‌‌‌‌‌కు 13 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైడ్రామా చోటు చేసుకుంది. 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు రాణాను నోర్జ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. తర్వాతి మూడు ఓవర్లలో గిల్‌‌‌‌‌‌‌‌, కార్తీక్‌‌‌‌‌‌‌‌ (0), మోర్గాన్‌‌‌‌‌‌‌‌ (0) వికెట్లు తీసిన అవేశ్‌‌‌‌‌‌‌‌, రబాడ, నోర్జ్‌‌‌‌‌‌‌‌ ఆరు రన్సే ఇచ్చారు. దాంతో, అశ్విన్‌‌‌‌‌‌‌‌ వేసిన లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌కు 7 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అయ్యాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు త్రిపాఠి సింగిల్‌‌‌‌‌‌‌‌ తీయగా.. సెకండ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు పరుగివ్వని అశ్విన్‌‌‌‌‌‌‌‌... మూడో బాల్‌‌‌‌‌‌‌‌కు షకీబ్‌‌‌‌‌‌‌‌ (0)ను ఎల్బీ చేశాడు.  తర్వాత నరైన్‌‌‌‌‌‌‌‌ (0) భారీ షాట్‌‌‌‌‌‌‌‌ ఆడి అక్షర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు.  సమీకరణం 2 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 రన్స్‌‌‌‌‌‌‌‌గా మారడంతో స్టేడియంలో ఒక్కటే ఉత్కంఠ. ఢిల్లీదే విజయం అనుకుంటున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన త్రిపాఠి  కోల్‌‌‌‌‌‌‌‌కతాను గెలిపించాడు.