నుపుర్‌ శర్మకు సమన్లు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

నుపుర్‌ శర్మకు సమన్లు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

కోల్‌కతా : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శర్మపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు నుపుర్‌ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో నిరసనలు నిర్వహించారు. 

నదియా జిల్లాలోని బెతువదాహరి స్టేషన్‌లో ఆదివారం (జూన్ 12న ) సాయంత్రం కొందరు వ్యక్తులు లోకల్ రైలుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది, కృష్ణానగర్-లాల్గోలా లోకల్ రైలులోని ప్రయాణికులు గాయపడ్డారని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. అయితే.. గత రెండు రోజులుగా హౌరా, ముర్షిదాబాద్‌ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉంది. హౌరాలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.