నరేన్ బాదుడు.. రాజస్థాన్ పై కోల్ కతా విక్టరీ

నరేన్ బాదుడు.. రాజస్థాన్ పై కోల్ కతా విక్టరీ

జైపూర్: రసెల్‌ .. రసెల్‌ .. రసెల్‌ .. ఈ సీజన్‌ లో కోల్‌ కతా పఠిస్తున్న మంత్రం ఇది. ఈ విండీస్‌ వీరుడి వీరబాదుడుతో అసాధ్యమనుకున్న మ్యాచ్‌ లను కూడా అలవోకగా గెలుస్తూ వస్తున్న దినేశ్‌ కార్తీక్‌ గ్యాంగ్‌ కు ఈ సారి ఆ అవసరం పడలేదు. ఓపెనర్లే దడదడలాడించడంతోఆదివారం రాజస్థా న్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యా చ్‌ లోకోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గి పాయింట్లపట్టి కలో టాప్‌ ప్లేస్‌ కు దూసుకెళ్లింది. మొదట రాయల్స్‌20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 రన్స్‌ చేసింది. స్టీవ్‌స్మిత్‌ (59 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌‌‌‌‌‌‌‌తో 73), బట్లర్‌‌‌‌‌‌‌‌ (34బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌‌‌‌‌‌‌‌తో 37) రాణించినా.. చాలాస్లోగా ఆడటంతో రాజస్థాన్‌ ఆశించిన స్కోరు చేయలేక పోయింది. రైడర్స్‌ బౌలర్లలో మ్యా న్‌ ఆఫ్‌ ది మ్యా చ్‌ హ్యారీగర్నీ (2/25) అదరగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌ లోక్రిస్‌ లిన్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50),సునీల్‌ నరైన్‌ (25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 47)ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కోల్‌ కతా మరో 37బంతులు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి140 రన్స్‌ చేసి విజయం సాధించింది.

నరైన్‌ , లిన్బాదుడే బాదుడు..

గత మ్యాచ్‌ లో 200 పైచిలుకు స్కోరునే అలవోకగాఛేజ్‌ చేసిన కోల్‌ కతాకు 140 రన్స్‌ టార్గెట్‌ ఏ మూలకు సరిపోలేదు. తొలి 2 ఓవర్లు ముగిసేసరికే మ్యాచ్‌ పై రాజస్థాన్‌ పట్టుకోల్పోయింది. కులకర్ణి వేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో లిన్‌ రెండు ఫోర్లు బాదితే.. గౌతమ్ వేసిన మరుసటిఓవర్‌‌‌‌‌‌‌‌లో నరైన్‌ పండుగ చేసుకున్నా డు. 4,6,4,4,4తో 22 రన్స్‌ రాబట్టాడు. ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లే ముగిసే సరికి కోల్‌ కతా వికెట్‌నష్టపోకుండా 65 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలివికెట్‌ కు 8.3 ఓవర్లలోనే 91 రన్స్‌ జోడించాక నరైన్‌ఔటయ్యాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న లిన్‌కూడా వెనుదిరి గినా.. శుభ్‌ మన్‌ గిల్‌ (6 నాటౌట్‌ )తోకలిసి ఊతప్ప (16 బంతుల్లో ఫోర్‌‌‌‌‌‌‌‌, 2 సిక్సర్లతో 26)మిగతా పని పూర్తిచేశాడు.

స్మిత్రాణించినా

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన రాజస్థాన్‌ కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ప్రసిద్ధ్‌‌‌‌‌‌‌‌ వేసిన రెండోఓవర్లో కెప్టెన్‌ రహానె (5) ఎల్బీగా వెనుదిరిగాడు. మరోఓపెనర్‌‌‌‌‌‌‌‌ బట్ల ర్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్మిత్‌ ఇన్నింగ్స్‌ ను ముం దుకునడిపించాడు. పవర్‌‌‌‌‌‌‌‌ప్లే ముగిసే సరికి రాయల్స్‌28/1తో నిలిచింది. ఈ జోడీ రెండో వికెట్‌ కు 72 రన్స్‌జోడించాక బట్లర్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. అనంతరం నెమ్-దిగా ఆడుకుంటూ వచ్చిన స్మిత్‌ 15వ ఓవర్లో రెండుఫోర్లతో జట్టు స్కోరును 100 దాటించడంతో పాటు44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే త్రిపాఠి (6) కూడా ఔటయ్యాడు. ఈ దశలోస్మిత్‌ కు బెన్‌ స్టోక్ స్‌ (14 బంతుల్లో 7 నాటౌట్‌ ) జతైనాపరుగుల వేగం పెరగలేదు. భారీ షాట్లు ఆడేందుకుఇబ్బం ది పడ్డ ఈ జంట చివరకు టీమ్‌ కు ఓ మోస్తరుస్కోరే అందించగలిగింది.

స్కోర్‌ బోర్డ్‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజస్థాన్ : రహానె (ఎల్బీ) ప్రసిద్ధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5, బట్ల ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సి) గిల్‌ (బి) గర్నీ 37, స్మిత్‌ (నాటౌట్‌ ) 73, త్రిపాఠి(సి) చావ్లా (బి) గర్నీ 6, స్టోక్ స్‌ (నాటౌట్‌ ) 7; ఎక్స్‌ ట్రాలు: 11; మొత్తం : 20 ఓవర్లలో 139/3;వికెట్ల పతనం: 1–5, 2–77, 3–105; బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: చావ్లా 4–0–19–0, ప్రసిద్ధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4–0–35–1,నరైన్‌ 4–0–22–0, కుల్దీప్‌ 4–0–33–0, గర్నీ 4–0–25–2.

కోల్కతా : లిన్‌ (సి) మి ధున్‌ (బి) గోపాల్‌ 50, నరైన్‌ (సి) స్మిత్‌ (బి) గోపాల్‌ 47, ఊతప్ప(నాటౌట్‌ ) 26, గిల్‌ (నాటౌట్‌ ) 6; ఎక్స్‌ ట్రాలు: 11; మొత్తం : 13.5 ఓవర్లలో 140/2; వికెట్లపతనం: 1–91, 2–114; బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కులకర్ణి 3–0–31–0, గౌతమ్‌ 1–0–22–0, ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3–0–14–0, గోపాల్‌ 4–0–35–2, మిధున్‌ 2–0–27–0, స్టోక్ స్‌ 0.5–0–3–0.