
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా, తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘పవర్‌హౌస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను జులై 22న రాత్రి 9.30 నిమిషాలకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.
ఈ ఈవెంట్‌కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో పాటు టీమ్ అంతా పాల్గొనబోతున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, సురేష్ బాబు విడుదల చేస్తున్నారు. ఇక హిందీలో ‘కూలీ’ అనే టైటిల్ అందుబాటులో లేకపోవడంతో ‘మజ్దూర్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.