టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్

టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్

రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా ధాన్యం సమస్యపై పార్లమెంటులో మాట్లాడారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి సమస్యపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల కోసం తాము పదవులు వదులుకునేందుకు సిద్ధమన్న కోమటిరెడ్డి.. 9మంది టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూ.70వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ పార్టీ సొంతమని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్న ఆయన.. రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రైతుల పక్షాన నిలబడి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీంగా మారిందన్న ఆయన.. రాజకీయాలను పక్కన బెట్టి రైతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం..

14 మంది ప్రధానుల కృషిని కళ్లకు కట్టేలా మ్యూజియం

బ్యాంక్ సిబ్బంది నిర్వాకం.. 18 గంటలు లాకర్ గదిలోనే వృద్ధుడు