ఖరీఫ్ పంట అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న రైతులు

ఖరీఫ్ పంట అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న రైతులు

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పనికి రాని ప్రాజెక్టులను నిర్మించి కమిషన్ తీసుకుంటోందన్నారు.  ఖరీఫ్ పంట ధాన్యం అమ్ముకోలేక  రైతులు రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడాన్ని ఖండించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర  70 శాతం ధాన్యం ఉందని.. ఖరీఫ్ పంట కొనుగోలు చేయకుండా యాసంగి పంట కోసం పోరాటం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ లో మొదటి దోషి టీఆర్ఎస్ అయితే.. రెండో దోషి బీజేపీ అన్నారు.