
రాష్టంలో టిఆర్ఎస్ పార్టీ ఆరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అడ్వాకేట్ దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్. చేశారు. ప్రశ్నించే గొంతులను అడ్డుతొలగించడానికి టిఆర్ఎస్ పార్టీ హత్యలకు కూడా వెనుకాడటం లేదన్నారు. ఒక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉదయం కేసీఆర్ బర్త్ డేలో పాల్గొని మధ్యాహ్నం హత్యలో పాల్గొనడం దారుణమన్నారు. ఈ హత్య వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రతో రాష్టంలో అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసేలా చేస్తామన్నారు. రాక్షసపాలను అంతమందించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
see more news