ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోం : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

ప్రశాంత వాతావరణాన్ని  చెడగొట్టాలని చూస్తే ఊరుకోం : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బీ గెస్ట్ హౌస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మేయర్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయన్నారు. 

ప్రభుత్వం మారితే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. జ్యువెలరీ షాప్ లో చోరీ ఘటనపై పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారని, కౌశిక్ రెడ్డి కోడుగుడ్డు మీద ఈకలు పీకడం మానుకోవాలని అన్నారు. సమావేశంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, ప్రసాద్, భూమయ్య, శ్రీనివాస్, జగన్ రెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో 

కరీంనగర్ సిటీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలపై మండిపడ్డారు.