
విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రైతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ తెచ్చారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి జరిగిందన్నారు. యూపీఏ సర్కార్ ముందు చూపుతో కరెంట్ కష్టాలు తీర్చిందన్నారు. ముఖ్యమైన చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్ష నేత లేరని విమర్శించారు.
సభకు రాని ప్రతిపక్షనేత ఎందుకని ప్రశ్నించారు. వెంటనే రాజీనామా చేసి బీఆర్ఎస్ సభ్యులలో ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికి తెలుసన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుపుతుందని వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఆలోచించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు.
రూ. 7090 కోట్లతో స్టార్ట్ చేసి రూ. 10 వేల కోట్లకు పెంచారని తెలిపారు. రామగుండం ప్లాంట్ ఏర్పాటు రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే ఉందన్నారు. ఫ్రీగా వస్తున్నది తీసుకోక వేల కోట్లు అప్పు చేసి కొత్తది కడుట్టడానికి అప్రూవల్ ఇచ్చారని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పాత పనికరాలు వాడారని చెప్పారు. దీంతో భద్రాద్రిలో ఎప్పుడూ రిపేర్లు వస్తున్నాయన్నారు. బాధ్యతా రహితంగా పరిపలాంచారని విమర్శించారు.
ALSO READ : ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ముహూర్తం ఫిక్స్
మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారని చెప్పారు. యాదాద్రి, కాళేశ్వరం కేసీఆర్ ఐడియానే విమర్శించారు. 100 మంది కౌరవులలాగ అసెంబ్లీలో కొడతానికి వచ్చిర్రని ఆరోపించారు. ప్రతి గ్రామంలో వైర్లు వేలాడుతున్నాయని చెప్పారు. దుర్మార్గపు పాలన చేస్తే ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. సారు కారు సర్కారు 16 అన్న కేసీఆర్ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడ రాలేదన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యమన్నారు. విద్యుత్ విషయంలో తమ ప్రభుత్వాని చిత్తశుద్ధి ఉందని దానిపై విచారణ జరిపి మరిన్ని విషయాలు ప్రజలకు తెలుపుతామన్నారు రాజగోపాల్ రెడ్డి.