
బీహార్ లో మరో కొత్త పొలిటికల్ పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన కొత్త పార్టీని అక్టోబర్ 2న ప్రకటించబోతున్నట్లు చెప్పారు. పాట్నాలో జన్ సురాజ్ రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాగూర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. తాను చేపట్టిన జన్ సురాజ్ అభియాన్ యాత్రను పార్టీగా మార్చుబోతున్నట్లు వెల్లడించారు. బీహార్ లోని బాపు సభాఘర్ లో అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్షకు మందికి పైగా హాజరవుతారని అన్నారు. పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందన్నారు.
ప్రశాంత్ కిషోరో కొన్ని రోజుల క్రితమే జన సురాజ్ యాత్ర చేపట్టారు. విద్య ఉపాధి, ఆరోగ్యం వంటి కీలక అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు.