
తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . బీఆర్ఎస్ నేతల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని, జైలు కెళ్లటం ఖాయమని చెప్పారు. మీరు చేయాల్సింది మీరు చేశారు.. మీ చేయాల్సి మేం చేస్తామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మీరు చేయాల్సిన తప్పులను ప్రభుత్వం బయటకు తీస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రా్న్ని అప్పుల ఊబిలోకి మార్చిందన్నారు. జగదీశ్ రెడ్డి ప్రస్టేషన్ లో ఉన్నారన్నారు. కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డితో పాటుగా మాజీ సీఎండీ ప్రభాకర్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 24 గంటలు కరెంట్ ఇస్తే లాక్ బుక్ లు ఎందుకు హైదరాబాద్ లో దాచిపెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో 12 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు.