అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే

అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే

హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవాళ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. అయితే రేవంత్ క్షమాపణ అంగీకరించేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే క్షమాపణల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పడం సంతోషమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి క్షమాపణ గురించి మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించింది ’’ అని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే... మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాాషా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు. పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని.. తనను మునుగోడులో అనరాని మాటలు అనిపించారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.