పాండవుల్లా 100 మంది ఎమ్మెల్యేలపై మా పోరాటం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పాండవుల్లా 100 మంది ఎమ్మెల్యేలపై మా పోరాటం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత  భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీ కోమటి  రెడ్డి వెంకట్  రెడ్డి. నిమ్స్ లో భట్టి విక్రమార్కను పరామర్శించిన కోమటి రెడ్డి.. అసెంబ్లీ లో 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పంచ పాండవుల్లా..  కౌరవుల్లా ఉన్న 100 మంది  టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్ లో ముగ్గురు ఎంపీలం త్రిమూర్తులుగా  పోరాటం చేస్తామన్నారు. పార్టీ పిరీయింపులపై చట్టంలో మార్పులు చేయాలన్నారు.  ప్రతిపక్ష నేత దళితుడు ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. పార్టీ నాయకులు మారినా  కార్యకర్తలు పార్టీని మారడం లేదని..రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని బెదిరించి ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నామ రూపాలు లేకుండా పోతుందన్నారు. రేపు కలెక్టరేట్ ల ముందు ధర్నాను కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కోమటి రెడ్డి