రోడ్లు, ఆర్వోబీ పనులను స్పీడప్ చేయండి..అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశం

రోడ్లు, ఆర్వోబీ పనులను స్పీడప్ చేయండి..అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం కింద చేపట్టిన బ్రిడ్జిలు.. పురోగతిలో ఉన్న పలు ఆర్వోబీ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆదేశించారు. శనివారం ఆయన రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సచివాలయ ఉత్తర భాగంలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. భవన నిర్మాణ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా, మూడు వైపులా ఎలివేషన్ సుందరంగా ఉండేలా సోలార్ పార్కింగ్ పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.