అక్రమ యాడ్స్పై కొరడా.. నెస్లే, కోక్, రెడ్బుల్కు FSSAI నోటీసులు

అక్రమ యాడ్స్పై కొరడా.. నెస్లే, కోక్, రెడ్బుల్కు FSSAI నోటీసులు
  • లిస్టులో అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ కూడా

న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇవ్వడం, లేబులింగ్ నిబంధనలను పాటించని ఫుడ్​ కంపెనీలపై ఆహార భద్రత , ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ) చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రముఖ బ్రాండ్లకు సుమారు 150 నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, రెడ్ బుల్, డానాన్ ఇండియా, మాన్‌‌‌‌‌‌‌‌స్టర్ ఎనర్జీ, మాండేలీజ్ ఇండియా, డిజియో , ఫెర్రెరో వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఈ–కామర్స్ కంపెనీలు అమెజాన్,  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్​లకూ 12 నోటీసులు పంపింది. అమెజాన్ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసింది.  కేఎఫ్‌‌‌‌‌‌‌‌సీ, మెక్‌‌‌‌‌‌‌‌డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్ , కోస్టా కాఫీకి 30కి పైగా నోటీసులు వెళ్లాయి. నిబంధనలను పాటించని ఐదు డోమినోస్ ఔట్​లెట్ల లైసెన్సులు సస్పెండ్ చేశామని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ తెలిపింది.