హైదరాబాద్, వెలుగు: పండుగల సీజన్‌ను పురస్కరించుకుని అమెజాన్ రాఖీ పౌర్ణిమ కోసం ప్రత్యేకంగా రాఖీలను, బహుమతులను అందుబాటులోకి తెచ్చింది. 70 శాతం వరకు డిస్కౌంట్‌తో ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో టాప్ బ్రాండ్ల ఉత్పత్తులు లభిస్తున్నాయి.
బిబా, లిబాస్, మాన్యవర్, మేబెల్లిన్, సెటాఫిల్, శామ్సంగ్, ఎల్జీ, జేబీఎల్, సోనీ వంటి బ్రాండ్లపై ఆఫర్లు ఉన్నాయని సంస్థ తెలిపింది. ప్రైమ్ మెంబర్లకు అదనంగా 5 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. వీరికి ఫాస్ట్ డెలివరీ సౌకర్యమూ ఉంది.
రూ.19 నుంచి ప్రారంభమయ్యే 500కి పైగా వెరైటీ రాఖీలను అమెజాన్ నౌ ద్వారా కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. క్యూఆర్, ఎన్ఎఫ్సీ ఎనేబుల్డ్ రాఖీలు, డీఐవై, రాఖీ హగ్ కార్డ్స్, బ్లెస్డ్, హనుమాన్ చాలీసా రాఖీలు, కిడ్స్, పెట్ రాఖీలు వంటివి అందుబాటులో ఉన్నాయి. స్వీట్లు, బహుమతుల రేట్లు రూ.99 నుంచి మొదలవుతాయి.
