బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనపై సస్పెన్స్.. రాష్ట్రపతి భవన్ ప్రకటన ఉపసంహరణ

బంగ్లాదేశ్ ప్రధాని పర్యటనపై సస్పెన్స్.. రాష్ట్రపతి భవన్ ప్రకటన ఉపసంహరణ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటనపై సస్పెన్స్ ​నెలకొంది. ఆగస్టు 23, 24న ఆయన ఢిల్లీకి వస్తారని ప్రచారం జరిగినా కేంద్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ విషయంపై శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్​ను ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని చెప్పారు.

 రెహ్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించేందుకు పూర్తి స్థాయి రిహార్సల్ అవసరమన్న కారణంతో శనివారం జరగాల్సిన ‘చేంజ్ ఆఫ్ గార్డ్’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ తొలుత ప్రకటించింది. 

దీంతో రెహ్మాన్ పర్యటన ఖరారైందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఈ నెల ప్రారంభంలో భారత్ ద్వైపాక్షిక పర్యటనకు రెహ్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.