ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ పనులు స్పీడప్ చేయాలి..

ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ పనులు స్పీడప్ చేయాలి..
  •     నాగర్​ కర్నూల్​ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట/నాగర్ కర్నూల్ టౌన్​ : అచ్చంపేట నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ షెడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించాలని నాగర్​కర్నూల్​కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. 

నిర్మాణ పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించి పునర్వినియోగించేలా ఈ యూనిట్‌‌‌‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు.  

 నోటీసులు తీసుకుంటేనే ఓటు హక్కు కల్పిస్తాం 

సర్​ఫామ్స్ నింపకుండా ఇవ్వని వారికి నోటీసులు జారీ చేసి ఓట్లను తొలగిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడారు. సర్​ ప్రక్రియ అరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే తమ బాధ్యత అన్నారు.

 ఓటర్లకు ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మార్పులు, చేర్పులు తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తులను సమర్పించాలన్నారు. 2002 నాటి ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కానీ 13,216 మంది ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,15,851 ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.