The 100 Movie: ‘ది 100’ సందేశాత్మక చిత్రం.. మంత్రి కోమటిరెడ్డి

The 100 Movie: ‘ది 100’ సందేశాత్మక చిత్రం.. మంత్రి కోమటిరెడ్డి

‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ హీరోగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కరుటూరి, వెంకి పుషడపు నిర్మించిన చిత్రం ‘ది హండ్రెడ్’. జులై 11న సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘గొప్ప మెసేజ్ ఇచ్చే చిత్రమిదని’ అన్నారు. 

సైబర్ క్రైమ్ నేపథ్యంతో రాబోతున్న  ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం. ఈ ఏడాది గద్దర్ అవార్డ్స్‌‌‌‌లో బెస్ట్ ఫిల్మ్‌‌‌‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. దర్శకులు బి గోపాల్, ఎస్‌‌‌‌ గోపాల్ రెడ్డి, కోదండ రామిరెడ్డి సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.

సాగర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒక వెపన్.  ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. కలియుగంలో ఈ సినిమాకి అంత పవర్ ఉంది’అని చెప్పాడు.

రెగ్యులర్ సినిమాలా కాకుండా కొత్తగా ఉంటుందని హీరోయిన్స్ మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, దర్శకుడు రాఘవ్ చెప్పారు. ‘మా హండ్రెడ్ సినిమా వంద రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం’అని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.