కోమటిరెడ్డికి బర్త్ డే గిఫ్ట్ : భువనగిరిలో విక్టరీ

కోమటిరెడ్డికి బర్త్ డే గిఫ్ట్ : భువనగిరిలో విక్టరీ

భువనగిరి : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. TRS అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైనప్పట్నుంచి ఇద్దరి మధ్యన టఫ్ ఫైటింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన భువనగిరి విజయం చివరకు కోమటిరెడ్డిని వరించింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బర్త్ డే కావడంతో ఈ విజయం ఆయనకు పెద్ద గిఫ్ట్ అని సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.