మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్:  రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైపు నిలబడి ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుండి వివక్ష చూపించిందని, నియోజకవర్గానికి కావాల్సిన నిధులను ఇవ్వలేదని, అందుకే ఉప ఎన్నిక వచ్చిందన్నారు.

ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మంత్రులు మునుగోడు విడిచివెళ్లకుండా నియోజకవర్గంలోనే తిష్టవేశారని, విచ్చిలవిడిగా డబ్బులు, మద్యం పంచి పెడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పెద్ద మొత్తంలో నగదును పంచిపెట్టినా మునుగోడులో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మునుగోడులో అక్కడకక్కడా మినహాయించి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఫలితం వెలువడనుంది.