పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉంది: కొండా సురేఖ

 పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉంది: కొండా సురేఖ

సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పటాన్ చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉందని అన్నారు. ఈ శాఖ మంత్రిగా మొదటిసారిగా పాశమైలారంలో ఇంత పెద్ద సీఈటీపీ ప్లాంట్ ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులు పాల్గొన్నారు. 

రాంకీ సంస్థ పారిశ్రామిక వ్యర్థాలను సిఈటిపి ప్లాంట్ ద్వారా పొల్యూట్ అయిన వాటర్ ను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభపరిణామని,- ఈ ప్లాంటుకు రూ.104 కోట్లు ఖర్చు కాగా అందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ ద్వారా రూ.25 కోట్లు మంజూరైయ్యాయని మంత్రి తెలిపారు. - ప్రస్తుతం రూ.12.5 కోట్లు విడుదల చేయగా మిగతా నిధులను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించిందని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

ALSO READ :- ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ....... ఈ గుడితో అర్జునుడికి సంబంధం ఉందట..

1980- ఇందిరా గాంధీ హయాంలో పాశమైలారం ప్రాంతంలో  పరిశ్రమల స్థాపన జరిగిందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. - మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని, - పరిశ్రమల్లోని కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యాలపై, ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. - ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో కమర్షియల్ బిల్డింగులు కట్టడం సరికాదని చెప్పారు. ఆసియాలోనే నెంబర్ వన్ ప్లాంట్ పాశమైలారంలో ఏర్పాటు చేసుకున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. - గత ప్రభుత్వం ఇలా పరిశ్రమలు, కార్మికులతో  ఇంట్రాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు.  ప్రజా పాలన సీఎం రేవంత్ హయాంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.