కాశీబుగ్గ, వెలుగు: రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఆమె వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 120 సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ పాల్గొన్నారు.
అనంతరం మార్కెట్‌లో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని బి.రాజమణి అధ్యక్షతన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. మొత్తం 26 రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, 7 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్‌చైర్లు, 2 ల్యాప్‌టాప్‌లు డిగ్రీ విద్యార్థులకు పంపిణీ చేశారు.
