ఘనంగా కొండపల్లి సీతారామయ్య వర్ధంతి

ఘనంగా కొండపల్లి సీతారామయ్య వర్ధంతి

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాత కొండపల్లి సీతారామయ్య 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంస్మరణ వ్యాసాల పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ఆవిష్కరించారు. విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన నక్సల్స్ కు, జలియన్ వాల బాగ్ కాల్పులలో మరణించిన ప్రజలకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను, అక్రమ కేసులలోఅరెస్టు చేసిన వరవరరావుతో పాటు ప్రజాసంఘాల నేతలను బేషరతుగా విడుదల చేయాలని సభ తీర్మానించింది. దేశంలోని ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వారికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. సమాజంలో ఫాసిస్ట్ ధోరణి పెరిగిపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదంపొంచి ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకులు సంధ్యక్క, అరుణోదయ రామారావు విప్లవగీతాలు ఆలపించారు.