మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను సోమవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్, హైదరాబాద్‌లోని కొరియా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ చిత్రోత్సవం జరిగింది. ఇందులో భాగంగా పలు కొరియన్ సినిమాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కొరియన్ దర్శక నిర్మాత యూ ఇన్-షిక్ మాట్లాడుతూ ‘ఇక్కడి ప్రేక్షకులు నేను తీసిన సినిమాలు, డ్రామాలు చూసి, వాటి గురించి డీటెయిల్‌గా మాట్లాడుతుండటం చూసి ఆనందమేసింది. భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడి ప్రేక్షకుల కోసం సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాం’ అని అన్నారు.
కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ ‘కల్చరల్‌గా ఇండియా కొరియా మధ్య చాలా సారూప్యత ఉంటుంది. వాళ్ళందరూ మనలాగే చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉంటారు. ఇండియన్, కొరియన్ కొలాబరేషన్‌లో భవిష్యత్‌లో ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. కొరియన్ ప్రతినిధి లిమ్ సంగ్ వూ తదితరులు పాల్గొన్నారు.
