పనులు నిలిచె.. గుర్రపు డెక్క విస్తరించె

పనులు నిలిచె.. గుర్రపు డెక్క విస్తరించె

కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు మద్దుల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో రూ.4 కోట్లతో పనులు ప్రారంభించారు. పూడిక తొలగించి కొత్త మత్తడి నిర్మించి, చెరువు కట్ట విస్తరించారు. సిమెంట్ రోడ్డు వేసి, రెండు వైపులా రెయిలింగ్ నిర్మించారు. 

ఇనుప గేట్లు అమర్చి పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేశారు. కానీ పనులను మధ్యలోనే వదిలేయడంతో ట్యాంక్ బండ్​ కల తీరలేదు. రెండేండ్లుగా గుర్రపు డెక్క విస్తరించి చెరువు ఆనవాళ్లు కోల్పోయింది. బోటింగ్ కోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన 2 బోట్లు చెరువులోనే ఉండి నిరుపయోగంగా మారాయి. అధికారులు స్పందించి, మినీ ట్యాంక్​బండ్ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.--- కోరుట్ల, వెలుగు