ప్రధాని మోదీకి రాఖీలు పంపిన కోరుట్ల జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్

ప్రధాని మోదీకి రాఖీలు పంపిన కోరుట్ల జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్

కోరుట్ల,వెలుగు: కోరుట్ల లోని జడ్పీ గర్ల్స్​ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం రక్షా బంధన్​ నిర్వహించారు. స్టూడెంట్స్​ స్వయంగా తయారు చేసిన రాఖీలను ప్రధాని మోదీకి పోస్టులో పంపించారు. ఆపరేషన్​ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైన్యం ధైర్య సాహాసాలకు అభినందనగా రాఖీలు పంపినట్లు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

ఆకాశ్, బ్రహ్మోస్​, రాఫెల్, ఎస్​400 చిత్రాలను రాఖీలో ప్రదర్శించారు. కోరుట్ల  ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కోరుట్ల కోర్టులో బార్ అసోసియేషన్ లాయర్లకు బ్రహ్మాకుమారీస్​ రాజేశ్వరి, గీతలు రాఖీ కట్టి,  పండగ ప్రాముఖ్యతను వివరించారు.