
మలయాళ సినిమాలు ఇటీవల తెలుగులో బాగా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ సూపర్ సక్సెస్ సాధించిన ‘నయట్టు’ అనే సినిమాను గీతా ఆర్ట్స్ 2 సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి ‘కోట బొమ్మాళి పీఎస్’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు నటీనటుల ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తోంది.
‘హత్య కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు.., పరారిలో కోట బొమ్మాళి పోలీసులు’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ హత్య కేసులో ఇరుక్కున్న పోలీస్ ఆఫీసర్ల కథ ఇది. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. బన్నీ వాస్, విద్యా కొప్పిని నిర్మిస్తున్నారు. మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.