హాస్టళ్లలో స్ప్రింగ్ ఫ్యాన్లు బిగిస్తున్నారు.. ఉరేసుకున్నా ఇక చావరు

హాస్టళ్లలో స్ప్రింగ్ ఫ్యాన్లు బిగిస్తున్నారు.. ఉరేసుకున్నా ఇక చావరు

తలనొప్పి వస్తే కడుపు నొప్పి ట్యాబ్లెట్​వేసుకుంటే ఎలా ఉంటుంది? ఓ చోట ఇలానే చేసి నవ్వులపాలయ్యారు అధికారులు. రాజస్థాన్​లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీరిలో ఫ్యాన్​లకి ఉరేసుకుని చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్నారు. 

సూసైడ్​లను అరికట్టడానికి అధికారుల బ్రెయిన్​కి మాగొప్ప ఐడియా తట్టింది. అనుకున్నదే లేటు.. హాస్టళ్లలో స్ర్పింగ్​లతో కూడిన ఫ్యాన్​లు ఏర్పాటు చేశారు. ఎవరైనా సూసైడ్​ చేసుకోవాలని చూసిన వారి బరువుకు ఫ్యాన్​ ఊడి కిందకి వస్తుంది. ఏముంది ఆత్మహత్యలు ఆపినట్లే కదా అని వారి సమాధానం.

దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

ఆత్మహత్యలు జరగకుండా స్ప్రింగ్​ఫ్యాన్లు ఏర్పాటు చేయడంపై రాజస్థాన్​ ఆఫీసర్లపై నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్​లు జరగకుండా కౌన్సిలింగ్​ఇచ్చి ఆపాల్సింది పోయి స్ప్రింగ్​లు బిగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

వేరే విధంగా చనిపోతే దానికి కూడా ఇలాంటి పనికి మాలిన ఐడియాతో పరిష్కారం చూపుతారా  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  తమకు నచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.  ఆఫీసర్ల నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు మరి.