విద్యా సంస్థల భారీ భూదందా..వర్సిటీలను కుటుంబ సభ్యుల పేర్లతో నడిపిస్తున్నారు : కోట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

విద్యా సంస్థల భారీ భూదందా..వర్సిటీలను కుటుంబ సభ్యుల పేర్లతో నడిపిస్తున్నారు : కోట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • పీసీసీ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ఈసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలోని పలు ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యాసంస్థల అండతో భారీ భూదందాకు పాల్పడుతున్నాయని పీసీసీ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ఈసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. కాలేజీలను అడ్డం పెట్టుకొని భూదందా చేస్తున్న నర్సింహా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల పేర్లను ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లేకుండా చూడాలని హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలకిష్టారెడ్డికి ఫిర్యాదు చేశారు.

బుధవారం ఆయన హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట మీడియాతో మాట్లాడారు.. ఏఐసీటీసీ రూల్స్ ప్రకారం కాలేజీ అనుమతికి ముందే భూములన్నీ సంబంధిత విద్యా సొసైటీ పేరుమీదకు లీగల్ గా బదిలీ కావాల్సి ఉండగా, నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ భూములు ఇప్పటికీ వారి కొడుకుల పేరిట వ్యవసాయ భూములుగానే రెవెన్యూ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.  2020లో వచ్చిన ధరణి, 2025లో ప్రస్తుత కాంగ్రెస్  తెచ్చిన భూభారతి రికార్డుల్లోనూ ఈ ల్యాండ్స్ సొసైటీ పేరిట లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, సీఎంఆర్ సొసైటీలకు చెందిన కాలేజీలు, యూనివర్సిటీల భూములు కూడా సొసైటీల పేరుపై కాకుండా సొంత కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేసుకుని, ప్రభుత్వ సంస్థలకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తూ అనుమతులు పొందుతున్నారని ఆరోపించారు.

గతంలో మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని మల్లారెడ్డి కరోనా టైంలో రాత్రికి రాత్రే ప్రైవేట్ ఉమెన్స్ వర్సిటీ అప్రూవల్ తెచ్చుకున్నారన్నారు. అసలు పర్మిషన్ ఒకచోట తీసుకుని కాలేజీని మరోచోట నడపడం ఏఐసీటీసీ నిబంధనలకు విరుద్ధమన్నారు. 20 ఏండ్లుగా భూములు లేకపోయినా కేవలం కాగితాలపై తప్పుడు పత్రాలు చూపిస్తూ, మేనేజ్ చేయగలమనే ధీమాతో కోట్లు సంపాదిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ విద్యాసంస్థలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.