కోట సినీ పరిశ్రమకు ఒక డిక్షనరీ.. నేటి తరం నటులు ఆయన పుస్తకాన్ని చదవాల్సిందే..!

కోట  సినీ పరిశ్రమకు ఒక డిక్షనరీ.. నేటి తరం నటులు ఆయన పుస్తకాన్ని చదవాల్సిందే..!

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం  ( జులై 13) తెల్లవారుజామున ఫిలింనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినీ రంగంలో  ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు.   కోట సినీ ప్రపంచంలో తనదైన ముద్రను చాటుకున్నారు.

కోట సినీ పరిశ్రమలో ఓ పేజి రాసుకుని వెళ్ళలేదు...అతనో డిక్షనరీ...  పాత్ర కావాలన్నా ...కోట పుస్తకంలోకి తొంగి చూడాల్సిందే..  జీవిత వాస్తవ పాత్రలెన్నో తనను  కోరికోరి వరించి గర్వపడినవే. జంధ్యాల సినిమాలో ఈ పిసినారి లక్ష్మీపతి..నిజ జీవితంలో ఎన్నో గుప్త దాన ధర్మాలు చేసిన వితరణ శీలి..తరతరాలకు తరగని మాన్యం కోట శ్రీనివాసరావు.

సినీలోకంలో మరో దిగ్గజం నింగికెగసింది-. నవరసాలు తన నటన లో పలికించి పాత్రలెన్నిటిలోనో  జీవించిన మండలాధీసుడు సినీపరిశ్రమలో కీర్తికీరిటం ... విశ్వరూపంలా భయపెట్టి బెంబేలెత్తించే రౌద్రరూపం నేడు చిన్నబోయింది. వెన్నులో వణుకు పుట్టించే భయానక రసం మెండుగా పోషించిన వెండి తెర విలనిజం నటుడు కోట శ్రీనివాసరావు.

అందరిని నవ్వించే హాస్యం నేడు కన్నీరు పెడుతున్నది. వెండి తెరపై గుండెలను పిండేసే  కరుణామూర్తిగా సంబ్రమాశ్చర్యాలతో ముంచెత్తి అద్భుతంగా నవరసాలు పలికించాడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు. నిండుగా గంభీరంగా కనిపిస్తూ  ..నాలుగు దశాబ్దాలు పాటు  సినీ రంగాన్ని ఏలిన స్వయంకృషీవలుడు.. మహోన్నత నటుడు  కోటన్న...

సినీ రంగంలో   కోట శ్రీనివాసరావు  అమాయకంగా నవ్వటం తెలిసిన మహాభోగి...అతను చెయ్యని పాత్రలేదు... ఆయనకు చేతకాని నటనే లేదని నిరూపించిన ... నటన లేదు...  అద్భుతాలు  పండించిన విలక్షణ నటుడు ఇక లేరనే వార్తను సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. 

ALSO READ : Babu Mohan: నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు.. కన్నీటి పర్యంతమైన బాబూమోహన్‌

దక్షిణాది ప్రజల   గుండెల్లో  స్థానం సంపాదించుకున్న  .. విలనిజంలో నవరస సార్వభౌముడు.. లబ్దప్రతిష్టుడు ..ఎన్నో...ఎన్నెన్నో   పాత్రలలో సజీవుడైన మన కోట శ్రీనివాసరావు  సినీరంగంలో  లెజెండరీ కళాకారుడు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదేమో మరి..!  

 సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని మహా నటుడుకోట శ్రీనివాసరావు గారికి  యావత్​ టాలీవుడ్​ ప్రపంచం.. తెలుగునాటి రాజకీయ ప్రముఖులు బాధ తప్త హృదయంతో  అశ్రునివాళులు తెలుపుతున్నారు.