బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్లైన్ సూపర్ వైజర్స్దే కీలక పాత్ర : జీఎం షాలెం రాజు

బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్లైన్ సూపర్ వైజర్స్దే కీలక పాత్ర : జీఎం షాలెం రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్​లైన్​ సూపర్​ వైజర్స్​దే కీలక పాత్ర అని కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ఎంవీటీసీలో ఏర్పాటు చేసిన ఫ్రంట్​ లైన్​ సూపర్​ వైజర్స్​ ట్రైనింగ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..  రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  

నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.  బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్​లైన్​ సూపర్​వైజర్స్​ కృషి మరువలేనిదన్నారు. యాక్సిడెంట్లు లేకుండా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, ఏఐటీయూసీ వైస్​ ప్రెసిడెంట్​ కె. రాములు, ఐఎన్​టీయూసీ వైస్​ ప్రెసిడెంట్​ ఎండీ రజాక్​, డీజీఎం జీవీ మోహన్​రావు, ఏరియా ఇన్‌చార్జి ఇంజనీర్​ లక్ష్మణమూర్తి, ఎంవీటీసీ మేనేజర్​లక్ష్మణ్​ పాల్గొన్నారు.