భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో మెడికల్ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలివ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేతలు కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శనివారం వినతిపత్రం ఇచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే సమస్యలపై సీఎండీ బలరాంతో ఫోన్లో మాట్లాడారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అయి తమ వారసులకు ఉద్యోగాల కోసం కార్మికులు ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కార్మికులతోనే తీసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
