- మహబూబాబాద్ జిల్లా కొత్తపేట సర్పంచ్ వినూత్న ఆలోచన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కోతులను భయపెట్టి తరిమేందుకు సర్పంచ్ కొండెంగి అవతారమెత్తాడు. మహబూబాబాద్బయ్యారం మండలం కొత్తపేట మేజర్ పంచాయతీ కాంగ్రెసు సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ విన్నూత ఆలోచన చేశాడు. కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండముచ్చు వేషం ధరించాడు.
కర్ర పట్టుకొని గ్రామంలో తిరుగుతు కోతులను భయపెడుతూ తరిమికొట్టాడు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ తో కలిసి ఇంటికి ఒకరు చొప్పున మద్దతు తెలుపుతూ కోతుల తరిమి కొట్టారు. ఉప సర్పంచ్వీరభద్రరావు, వార్డు మెంబర్లు సురేశ్, రాంబాబు, యాకయ్య, లక్ష్మి, సతీశ్, శ్రీను, శివ, గ్రామస్తులు పాల్గొన్నారు.
