
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లకు చెందిన ఎంప్లాయీస్ కో-– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి.
పాల్వంచలోని కేటీపీఎస్ లో 11 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా, మొత్తం 3,003 ఓట్లలో 2,548 పోలయ్యాయి. ఇంజనీర్లు, కార్మికులు, అకౌంట్స్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఇంజనీర్లు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.
క్రెడిట్ సొసైటీ పరిధిలో 13 డైరెక్టర్ పోస్టుల్లో వివిధ కేటగిరిల్లో పలువులు అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కో సభ్యుడు 6 ఓట్లు వేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పాల్వంచ సీఐ సతీశ్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. కాగా పలువురు అభ్యర్థులు డబ్బులు భారీగా ఖర్చు చేశారు. కొందరు ఓటుకు వెయ్యి చొప్పున సభ్యులకు ముట్టజెప్పారు. ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. రాత్రి 10గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తా మని ఎన్ని కల అధికారులు గట్టు గంగాధర్, అవధానుల శ్రీనివాస్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున పూర్తి ఫలితాలు రానున్నట్టు పేర్కొన్నారు.