సరికొత్త ప్రేమ కథ.. కొత్త కొత్తగా

సరికొత్త ప్రేమ కథ.. కొత్త కొత్తగా

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా నటించిన ‘కొత్త కొత్తగా' సినిమా రిలీజ్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 09న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై సినిమా రూపొందింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా.. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందించారు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, పాటలు రిలీజయ్యాయి. వీటికి మంచి రెస్పాండ్ వచ్చింది. ఆనంద్, తులసి, కాశీ విశ్వనాథ్, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా వెంకట్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సాంకేతిక విభాగం :
దర్శకత్వం : హనుమాన్ వాసంశెట్టి
నిర్మాత : మురళీధర్ రెడ్డి ముక్కర
బ్యానర్ : ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్పకులు : బి జి గోవింద రాజు
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కెమెరా : వెంకట్
ఫైట్ మాస్టర్ : పృధ్వీ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ భీమగాని