కూకట్‌పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మల్లిపెద్ది యామిని(23) కొంతకాలంగా కేపీహెచ్‌బీ కాలనీలోని సమీక్ష ఎలైట్ ఉమెన్స్పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. గురువారం రాత్రి తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా అనంతరం డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా యామిని గతంలో ఓ యువకుడిని ప్రేమించినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఆత్మహత్య చేసుకుందా.. లేదా మరేదైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
