మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి సూసైడ్

మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి సూసైడ్

మూసాపేట, వెలుగు: కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందని కూకట్ పల్లి పోలీసులు వెల్లడించారు. స్టేషన్ బీ బ్లాక్ నుంచి వ్యక్తి దూకి సూసైడ్ చేసుకున్నాడని.. మృతునికి 40 నుంచి 50 ఏండ్ల వయసు ఉంటుందని వివరించారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో  కేసు నమోదు చేశామన్నారు. మృతుడి వివరాలేమీ తెలియరాలేదని..దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.