తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డ్

తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డ్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సాగునీటి కేటాయింపులు చేసింది. అందుబాటులో ఉన్న నీటిని వాటాల లెక్కన వచ్చే మార్చి 31 వరకు కేటాయింపులు జరిపింది. తెలంగాణకు 82.92 టిఎంసీలు, ఏపీకి 92.50 టీఎంసీ లు చొప్పున వాడుకునే విధంగా కేటాయించింది.వివరాలు ఇలా ఉన్నాయి.

  • శ్రీశైలం నుంచి ఏపీలోని పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి 4.3టీఎంసీలు, హంద్రీనీవా-ముచ్చుమర్రి ప్రాజెక్టుకు 23.06 టీఎంసీలు.
  • శ్రీశైలం నుంచి తెలంగాణలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు 17.92 టీఎంసీలు,
  • నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీకి 13.06 టీఎంసీలు, కుడి కాలువ నుంచి 51 టీఎంసీలు.
  • నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 40 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 18 టీఎంసీలు, హైదరాబాద్ కు తాగునీరుకు 4.5 టీఎంసీలు, మిషన్ భగీరథ 2.5టీఎంసీలు.

కృష్ణా బోర్డు కేటాయింపుల ఉత్తర్వు కాపీ కోసం కింద లింక్ పై క్లిక్ చేయండి

 

WRO dated 11.02.2021 (1)

 

For More News..

వీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు