జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జున సాగర్ లో 15 ఔట్ లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్ పై చర్చించనున్నారు. ప్రాజెక్టుల మరమ్మత్తులకు నిధులు వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు వంటి అంశాలపైనా చర్చ జరగనుంది. వీటితో పాటు బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించడం వంటి వాటిపైనా చర్చించే అవకాశముంది.