
శ్రీకృష్ణాష్టమి .. గోకులాష్టమి.. జన్మాష్టమి.. శ్రావణ బహుళ అష్టమి.. ఇదే రోజు విష్ణుమూర్తి 8 వఅవతారంగా శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. ఈ ఏడాది ఆగస్టు 16న గోకులాష్టమి పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బాల గోపాలుని పూజలో మంత్రాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. కృష్ణాష్టమి ( ఆగస్టు 16)న ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రాన్ని జపించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.. ఇలా చేయడం వలన కృష్ణ భగవానుడి ఆశీస్సులు పుష్కలంగా లభించి కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. ఇప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలో తెలుసుకుందాం. . .
- మేష రాశి : ఓం కమలనాథాయ నమః మంత్రాన్ని జపించాలి.
- వృషభ రాశి : ఓం గోవిందాయ నమః అనే మంత్రంతో పాటు కృష్టాష్టకాన్ని పారాయణం చేయాలి
- మిథున రాశి: ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.
- కర్కాటక రాశి : ఓం నందకిశోరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో పాటుగా రాధాష్టకం పారాయణం చేయాలి
- సింహ రాశి: ఓం కోటి-సూర్య-సమప్రభాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి
- కన్యా రాశి: ఓం దేవకీ నందనాయ నమః అనే మంత్రాన్ని శ్రద్దగా పఠించాలి
- తులా రాశి : ఓం లీలా-ధరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి
- వృశ్చిక రాశి: ఓం వరాహ నమః అనే మంత్రాన్ని చదువుతూ వరాహ రూపాన్ని స్మరించుకోవాలి
- ధనుస్సు రాశి: ఓం జగద్గురువే నమః అనే మంత్రాన్ని జపించాలి
- మకర రాశి: ఓం పూతనా-జీవిత హరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.
- కుంభ రాశి: ఓం దయానిధాయ నమః అనే మంత్రం చదవాలి
- మీన రాశి: ఓం యశోదా - వత్సలాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి.
పూజా విధానం
సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పీటపై తెల్లని వస్త్రంపై కొద్దిగా బియ్యం పోసి కృష్ణుడి విగ్రహాన్ని.. చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి. స్వామివారికి తులసి మాల సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. షోడశోపచారంగా పూజ చేయాలి. ఆ తరువాత మీ రాశికి సంబంధించిన మంత్రాన్ని 108 సార్లు శ్రద్దగా చదవాలి. తరువాత ధూపం వేసి.. స్వామి వారికి స్వీట్స్ నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో వెన్న ఉండే విధంగా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.