కాశీబుగ్గ, వెలుగు : వైద్య విద్యార్థుల పరిశోధనలు పెరగాలని వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్కాకతీయ మెడికాల్కాలేజీలో క్రితి 3.0 ఈవెంట్వేడుకలకు ముఖ్యఅతిథుగా కాళోజీ హెల్త్యూనివర్సిటీ వీసీతోపాటు కేఎంసీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎన్ఆర్ఐ పూర్వవిద్యార్థులు డాక్టర్లు సుజీత్, వేణు బతిని, అనుపమ హాజరయ్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి క్రితి -3.0 వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రతి వైద్య విద్యార్థి మరింతగా వైద్యరంగంలో అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం మెడ్ ఎక్స్పో, పేపర్ పోస్టర్ ప్రెజెంటేషన్లకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖులు వ్యవహరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, ప్రొఫెసర్లు, వేయి మందికిపైగా వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
