
ఐటెం సాంగ్స్ పై ఉప్పెన బ్యూటీ క్రేజీ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఆమె నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీ మూవీలో హీరోయిన్ గా నటించింది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంది కృతి.
ఇందులో భాగంగా ఆమెకు ఐటెం సాంగ్స్ గురించి ప్రశ్న ఎదురైంది."ఊ అంటావా మావ వంటి ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం మీకు వస్తే చేస్తారా? అని అడిగాడు రిపోర్టర్. దీనికి కృతీ చేయనని కుండ బద్ధలు కొట్టేసింది. "ప్రస్తుతానికి నేను అలాంటి ఐటం సాంగ్స్‌లో నటించాలనుకోవడం లేదు. నాకు అలాంటి పాటలపై సరైన అవగాహన లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా. ఇక నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయమేమిటంటే.. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడమే బెటర్.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌లో కూడా మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండటమే బెటర్ తెలుసుకున్నా. ఇక ఊ అంటావా పాట విషయానికి వస్తే.. సమంత ఒక ఫైర్.. ఆమె చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేను అలా చేయలేను అని చెప్పుకొచ్చింది కృతి.