కృతిశెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల

కృతిశెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల

వర్సటైల్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం..  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్  ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కృతిశెట్టి  ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె స్వాతి అనే పాత్రలో కనిపించనుంది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కృతి చాలా  స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో  కేథరిన్ త్రెసా మరో హీరోయిన్ గా నటిస్తుండగా, నటి అంజలి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ  ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది.