కృతి సనన్ : ప్రభాస్​ చాలా స్పెషల్​.. ఎందుకంటే?

కృతి సనన్ : ప్రభాస్​ చాలా స్పెషల్​.. ఎందుకంటే?

రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas)​– కృతి సనన్(Kriti Sanon)​ల ‘ఆదిపురుష్(Adipurush)’​ రిలీజ్​ డేట్​ దగ్గర పడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కృతి సనన్​ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్​ను తానెందుకు అంతలా అభిమానిస్తుందో చెప్పుకొచ్చింది. అతనిలోని కొన్ని క్వాలిటీస్​ తనను ఆకట్టుకునేవని తెలిపింది. 

‘మొదట్లో ప్రభాస్​ నాతో మాట్లాడేందుకు సిగ్గుపడేవాడు. తర్వాత నేనే అతడితో మాటలు కలిపా. నా తొలి సినిమా గురించి మాట్లాడాను. భాష రాకుండా సినిమా చేయడం ఎంత కష్టమో కదా అన్నాను. అప్పుడే నాతో తొలిసారి మాట్లాడాడు. నేను మామూలుగా మాట్లాడేదాన్ని. ప్రభాస్​ మాత్రం ఓపెన్​గా ఉండేవాడు. తన పనితాను చేసుకుపోయే టైప్​. అతను చాలా ప్రశాంతమైన వ్యక్తి. కళ్లతోనే మనసులోని భావాలను పలికించగలడు. ఆదిపురుష్​లో రాఘవుడి పాత్రలో ప్రభాస్​ కాకుండా మరొకరిని నేను ఊహించుకోలేను’ అంటూ కృతి వివరించింది.