మెగా హీరో మైండ్​ బ్లాక్ చేశాడట

మెగా హీరో మైండ్​ బ్లాక్ చేశాడట

నేషనల్​అవార్డు విన్నర్​ కృతి సనన్(kritisanon)​ మెగా హీరోపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేసింది. ప్రస్తుతం అవార్డు గెలుపొందిన సంతోషంలో ఈ ముద్దుగుమ్మ మునిగి తేలుతోంది. ఇక ఈ అవార్డు అందుకున్న తన తోటి నటీనటులకు కూడా కృతి అభినందనలు తెలిపింది. 

ఇటీవల తనను ప్రశంసిస్తూ అల్లుఅర్జున్(Allu Arjun) ​చేసిన ట్వీట్కి కృతి బదులిచ్చింది. పుష్ప సినిమాలో బన్ని నటన చూసి తనకు మైండ్​ బ్లాక్​ అయ్యిందని తెలిపింది. ఈ సినిమాతో తాను అల్లు అర్జున్​కి ఫ్యాన్​ అయిపోయానంటూ తన పోస్ట్​లో తెలిపింది. 

నేషనల్​ అవార్డుకు బన్నీ అర్హుడు అంటూ పేర్కొంది. ఈ హీరో ఫ్యాన్స్​ కూడా కృతికి కంగ్రాట్స్​ చెప్తూ కామెంట్స్​ చేస్తున్నారు. బాలీవుడ్​లో వచ్చిన మిమి సినిమాకు గానూ ఉత్తమ నటిగా కృతి ఈ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.