
‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో పదకొండేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్.. ఆ తర్వాత తెలుగు కంటే హిందీ చిత్రాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం ఆమె ధనుష్‌కు జంటగా ‘తేరే ఇష్క్ మెయిన్’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తాజాగా మరో మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పదమూడేళ్ల క్రితం నటించిన ‘కాక్ టైల్’ చిత్రానికి ఇటీవల సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సీక్వెల్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్స్‌గా రష్మిక మందన్నతోపాటు కృతి సనన్ నటిస్తోంది. తాజాగా కృతి సనన్ ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేసింది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే తాను జాయిన్ కానున్నట్టు చెప్పింది. లవ్ రంజన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, ఫస్ట్ పార్ట్‌ను రూపొందించిన హోమి ఆడజానియా దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.