కృతీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడట.. క్లారిటీ ఇచ్చేసింది

కృతీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడట.. క్లారిటీ ఇచ్చేసింది

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) వెనకాల ఒక స్టార్ హీరో కోడుకు పడుతున్నారట. కృతి ఇక్కడికే వెళితే అక్కడ ప్రత్యేక్షమవుతున్నాడట ఆ స్టార్ కిడ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ వార్త గురించే చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది కృతి శెట్టి. 

రీసెంట్ గా ఓ తమిళ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించింది కృతి. తనపై వస్తున్న రూమర్స్ అన్ని అబద్దం అని, నా వెనకాల ఎవరు పడటంలేదని, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇలాంటి వార్తలు రాసేవారిపై పై కూడా స్పందించింది. అసలు ఇలాంటి న్యూస్ ఎవరు, ఎందుకు స్ప్రెడ్ చేస్తారో అర్థం కాదు. అలాంటి వార్తలు వేయడం వల్ల అవతలి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి అలాంటి వార్తలు నమ్మకండి అంటూ ఘాటుగా స్పందించింది కృతి. ఇక కృతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ :సిరీస్ కోసం రూ.2000 కోట్లు.. మొత్తం స్మాష్
 

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ హీరో సూర్య(Suriya), డైరెక్టర్ బాలా(Bala) కాంబోలో వస్తున్న "వనంగాన్(Vanangaan)" సినిమా సినిమాలో చేస్తోంది. ఇక తమిళంలో జీనీ(Genie), మలయాళంలో అజాయంతే రండం మోషణం(Ajayante Randam Moshanam) సినిమాలు చేస్తోంది.